చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

11-09-2026 | 05:10am
  1. ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి 

ఘనంగా సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి

హాజరైన ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. అంజన్ కుమార్ యాదవ్ 

ముషీరాబాద్, సెప్టెంబర్10 (విజయక్రాంతి)తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలు పార్టీల నేతలు  పేర్కొన్నారు. ఈ మేరకు గు రువారం తెలంగాణ రజక (ధోబి) అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నరసింహ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని సంస్థ కార్యాలయం ఎదుట తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఎం. అం జన్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జైసింహ, బిజెపి జాతీ య ఓబిసి కార్యవర్గ సభ్యుడు పూసరాజు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శో భన్ తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక (ధోబి) అభివృద్ధి సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ మందల గాంధీ,

రాష్ట్ర కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ రాష్ట్ర కార్యదర్శి బి. సుక్కన్న పి. కిషన్ సుధాకర్, శ్రీధర్ స్థానిక కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ స్థానిక చైర్మన్ సాయి సత్యనారాయణ, కుమార్, సుదర్శన్, బీఆర్‌ఎస్ నేతలు ముచ్చక్కుర్తి ప్రభాకర్, వల్లాల శ్యామ్ యాదవ్, మధు, జమాలుద్దీన్, బిజెపి నా యకులు భరత్ గౌడ్, రమేష్ రామ్, కాంగ్రెస్ నాయకులు రమేష్ యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో వర్ధంతి కార్యక్రమాలు 

ఎల్బీనగర్ : వీరనారి చాకలి ఐలమ్మ పో రాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని వివి ధ పార్టీల నాయకులు కొనియాడారు. ఐల మ్మ పోరాట స్ఫూర్తితో బహుజనులు తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆ యా డివిజన్లలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమా లు నిర్వహించారు. చింతలకుంట లోని చాక లి ఐలమ్మ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించా రు.

రామకృష్ణాపురం డివిజన్ లోని బీజేఆర్ భవన్ వద్ద ఐలమ్మ కాంస్య విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి నివాళుల ర్పించారు. ఆయా కార్యక్రమాల్లో యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుద్ధ సత్యనారాయ ణ, పాశం అశోక్ గౌడ్, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాదరి బాలకృష్ణ యా దవ్, కార్యదర్శి చెల్లా రమేశ్,

నాయకులు పో చబోయిన సురేష్ యాదవ్, కొప్పుల వెంక ట్ రెడ్డి, ఎర్ర శేఖర్ గౌడ్, కన్నబాబు, బీజేపీ చింతలకుంట డివిజన్ అధ్యక్షుడు వాసు గణమనెను, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్చార్జి సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త రవీందర్ గౌడ్, కళ్లెం రవీందర్ రెడ్డి, కుంట్లర్ వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళి

జవహర్నగర్: శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ లో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 41 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, లక్ష్మీన రసింహస్వామి కాలనీ ఫేజ్-1 వెల్ఫేర్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్, రజక సంఘం అధ్యక్షుడు గుమ్మడి రాజు, వెంకన్న, లక్ష్మీనారాయణ, అంజిరెడ్డి, గోపి, సోమన్న, వీరయ్య, సంపత్, శ్రవణ్, పా పయ్య, కొమరయ్య, శంకరయ్య, శంకర్, బు చ్చి రాములు, సుమన్, నరేష్, రాములు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు