3 August, 2026 | 3:12 AM

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి

03-08-2026 02:04 AM

ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి

ఘట్ కేసర్, ఆగస్టు 2 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు.  ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని సద్భావన టౌన్ షిప్ లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  ఆదివారం మెగా హరిత హారం  కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది.

ఈకార్యక్రమంలో భాగంగా టౌన్ షిప్ పరిసరాల్లో 100 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ఘట్ కేసర్ సర్కిల్  డిప్యూటీ కమిషనర్ వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటడం కాదు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కిషోర్, ఎ3 బ్లాక్ ప్రెసిడెంట్ సురేందర్, జనరల్ సెక్రటరీ మెట్టు తిరుమల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ  శ్రీకాంత్,  బి2 బ్లాక్  ప్రెసిడెంట్ నటరాజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ  రంజిత్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.