27 June, 2026 | 1:14 AM

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

27-06-2026 12:03 AM

రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

బాన్సువాడ, జూన్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో  శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి, నమోదు చేసిన దరఖాస్తు పత్రాలను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి.

18 సంవత్సరాలు నిండిన యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు కావాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు SIR కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఎలాంటి అపోహలు, దుర్వినియోగానికి తావు ఇవ్వకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దగ్గరుండి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, రవీందర్ కౌన్సిలర్  ఖలేఖ్, కొట్టం  గంగాధర్  మన్సూర్ ,బోడ  భాస్కర్ శంకర్,  ఎన్నికల అధికారులు, BLOలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.