7 March, 2026 | 9:11 PM

తంగళ్లపల్లిలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ

07-03-2026 07:49 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్ఎస్ తంగళ్లపల్లి పట్టణ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తంగళ్లపల్లి పట్టణ అధ్యక్షుడు బండి జగన్ , మాజీ జెడ్పీటీసీ కొడి అంతయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో , వార్డ్ మెంబర్ సద్ద రోజా, నాయకులు కందుకూరి రామగౌడ్, వెంగళ రమేష్, శివ, ఉమాశంకర్, విజయ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.