మంత్రి ఉత్తమ్ కి పాలాభిషేకం
పాలకీడు: పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామం లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. గుడుగుంట్ల పాలెం నుండి ఎల్లాపురం వరకు 8.00 కిమీల మేర సింగిల్ లైన్ నుండి 18 కోట్లతో డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో గుడుగుంట్ల పాలెం, ముసిఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. హుజుర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలకవీడు మండలం గుడుకుంటపాలెం పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది.
మూడు గ్రామాల ప్రజలు మండల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్, జిల్లా నాయకులు బైరెడ్డి జితేందరరెడ్డి మరియు మండల నాయకులు నర్సింహారావు,గుడుగుంటపాలెం గ్రామ సర్పంచ్ మునగాల రామానుజన్ రెడ్డి , సింగారం సర్పంచ్ భూపాల్ రెడ్డి ఎల్లపురం సర్పంచ్ పెరుమాళ్ళ సురేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు తీగల శేషిరెడ్డి .మరియు ఉప సర్పంచ్ లు, వార్డ్ సభ్యులు, నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు




