బెజ్జంకి క్రిస్టల్ పత్తి క్షేత్ర ప్రదర్శనకు విశేష స్పందన
16-09-2026 | 07:19pm
బెజ్జంకి, సెప్టెంబర్ 16: బెజ్జంకి మండల(Bejjanki Mandal) కేంద్రంలో బుధవారం క్రిస్టల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదానంద్ పత్తి పంట క్షేత్ర ప్రదర్శనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సాగు పద్ధతులతో పత్తిలో అధిక దిగుబడులు సాధించే విధానం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటలో చీడపీడల నివారణ, పంట సంరక్షణ చర్యలపై సంస్థ ప్రతినిధులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.
రైతులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా రైతు గుంటి రాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్రిస్టల్ సంస్థ ప్రతినిధులు దురుగంటి మనోహర్ రెడ్డి, శ్రీకాంత్, డిస్ట్రిబ్యూటర్ సాయి రామ ఫర్టిలైజర్, రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.