5 March, 2026 | 2:46 AM

దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించిన ఎక్సైజ్ ఎస్ఐ

18-03-2025 08:40 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులో కాలిపోయిన ఈతవనాన్ని దోమకొండ ఎక్సైజ్ ఎస్సై దీపిక పరిశీలించారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఈత వనాన్ని దగ్ధం చేశారని, ఈ విషయాన్ని గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ మధుసూదన్ రావు ఆదేశాలతో ఎస్సై దీపిక అడ్రస్ స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.