22 April, 2026 | 2:09 AM

వ్యవసాయానికి వెలుగులు

22-04-2026 12:21 AM

కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్తు ఫీడర్ల విస్తరణ

రూ. 1.50 కోట్లతో ఫీడర్ ఛానళ్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఏప్రిల్ 21(విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆమనగల్లు మరియు ఆకుతోటపల్లి విద్యుత్తు ఉపకేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫీడర్ ఛానళ్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. ఆమనగల్లు, ఆకుతోటపల్లి చంద్రధన తలకొండపల్లి మండలం గ్రామాల్లోని విద్యుత్తు ఉపకేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి రూ. 50 లక్షల చొప్పున, మొత్తం రూ. 1.50 కోట్లతో మూడు కొత్త ఫీడర్ ఛానళ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.గ్రామాల్లో ఎక్కడైతే లో-వోల్టేజీ సమస్య ఉందో, అక్కడ అదనపు విద్యుత్తు నియంత్రికలను (ట్రాన్స్ఫార్మర్లు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబడిన మరియు వంగిపోయిన విద్యుత్తు స్తంభాల స్థానంలో వెంటనే కొత్త స్తంభాలను అమర్చాలని సూచించారు.

అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆమనగల్లు మండల పరిషత్తు కార్యాలయంలో ఆమనగల్లు సబ్ డివిజన్ పరిధిలోని (ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల) విద్యుత్తు అధికారులతో సమీక్ష నిర్వహించారు.రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టిన మూడు నెలలలోపు వాటిని బిగించి విద్యుత్తు సరఫరా ప్రారంభించాలి. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.‘ అని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, విద్యుత్తు శాఖ ఏడీఈ బాలకృష్ణ, ఎంపీడీవో కుసుమ మాధురి, మరియు నాలుగు మండలాల ఏఈలు శంకర్, నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, రమేష్, నాయకులు యాట నర్సింహా, జగన్, మానయ్య తదితరులు పాల్గొన్నారు.