22 April, 2026 | 1:37 AM

27న బీఆర్‌ఎస్ ప్రత్యేక సమావేశం

22-04-2026 12:23 AM

రజతోత్సవ వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ 

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురాల ముగింపు వేళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చే శారు.

ఈ సమావేశంలో పార్టీ సం స్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర రాజకీయ అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. సభ్యత్వా ల పునరుద్దరణ కార్యక్రమంతో పా టు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని భవిష్యత్ కార్యాచరణను ప్రక టించే అవకాశం ఉంది.