10 July, 2026 | 6:39 AM

పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు

08-07-2024 02:05 AM

హైదరాబాద్, జూలై 7(విజయక్రాంతి): ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ప్రమా దం జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బీహర్, యూపీ, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రుల్లో క్షతగా త్రులకు చికిత్స అందదిస్తున్నారు. ఈ ఘటనపై కార్మిక  శాఖ మంత్రి సుభాష్ స్పందిం చారు. ఫ్రీ హీటర్ లోపంతో పేలుడు జరిగిన ట్లు తెలిసిందని, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలైమందని పేర్కొన్నారు.