1 April, 2026 | 3:31 AM

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు

01-04-2026 01:00 AM
  1. ఎస్‌ఐ సహా నలుగురికి తీవ్రగాయాలు
  2. కృష్ణాజిల్లాలో ఘటన   

అమరావతి, మార్చి 31: ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు సంభవించి నలుగురు పోలీసులకు తీవ్ర   గాయాలయ్యాయి. మందు గుండు సామగ్రిని బయట నుంచి తీసుకొచ్చి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఎస్‌ఐతోపాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌తో పాటు బయట పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.