12 April, 2026 | 2:14 AM

లెబనాన్‌పై దాడులు

12-04-2026 12:49 AM

బీరుట్, ఏప్రిల్ ౧౧: పాక్ వేదికగా శనివారం అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చ లు ప్రారంభమైనప్పటికీ, అమెరికా మద్దతుదారైన ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. లెబనాన్‌పై దాడుల నిలిపివేత తాత్కాలిక కాల్పుల విరమణలో భాగమైనప్పటికీ, ఇజ్రాయెల్ తన సైన్యంతో రెట్టింపు వేగంతో విరు చుకుపడింది. శనివారం ఏకంగా లెబనాన్‌లోని 200 లక్ష్యాలను టార్గెట్ చేసి రాకెట్ లాంచర్లు, బాంబులు విసిరింది.

దాడుల్లో 10 మంది మరణించారు. అనేక మంది తీ వ్రంగా గాయపడ్డారు. బుధవారం నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 357 మంది పౌరులు మృతిచెందారని లెబనాన్ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ దాడులను ప్రతిఘటిస్తున్నది. తన శక్తి మేరకు దాడులకు దిగుతున్నది.