ఆర్‌జీకర్‌లో 10మంది డాక్టర్ల బహిష్కరణ
బెదిరింపులు, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
కోల్‌కతా, అక్టోబర్ 6: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, ఈ ఆసుపత్రికి చెందిన పదిమంది వైద్యులను బహిష్కరిస్తూ ఆ ఆసుపత్రి ఇంటర్నల్ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. వీరిపై.. ఆసుపత్రి సిబ్బంది, వైద్య విద్యార్థులపై.. బెదిరింపులు, ర్యాగింగ్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీరిపై శాశ్వత బహిష్కరణ వేటు వేయాలని కూడా కౌన్సిల్ అభిప్రాయపడింది. వీరితో పాటు ఇంటర్న్‌లు, విద్యార్థు లు, హౌస్‌సిబ్బంది సహా మొత్తం 59 మంది ని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మాజీ ప్రిన్సిపాల్‌తో సంబంధాలు..
సీబీఐ అరెస్టు చేసిన సౌరభ్ పాల్, ఆశిష్ పాండే, అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీ.. బహిష్కరించినవారి లిస్టులో ఉన్నారు. వారందరికీ హాస్టల్ ఖాళీ చేయడానికి 72 గంటల సమయం ఇచ్చారు. వారి పేర్లను రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని తెలిపారు.
వారి మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. నిందితులు ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తో కూడా సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. జూడాల నుంచి అనేక ఫిర్యా దులు స్వీకరించిన తర్వాతే వారు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు సమాచారం.






