5 May, 2026 | 9:30 PM

గోసంసద్‌కు అంకురార్పణ

07-10-2024 12:31 AM
  1. భువనేశ్వర్‌లో ప్రారంభించిన శంకరాచార్య స్వామీజీ అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 
  2. గోవును రాజ్యమాతగా గుర్తించాలని కార్యక్రమం 

భువనేశ్వర్, అక్టోబర్ 6: గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ ఆదివారం భువనేశ్వర్ చేరుకున్నారు. ఒడిశా రాజధానిలో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్థాపించారు.

శనివారం జార్ఖండ్‌లో గోధ్వజ్ స్థాపన చేసిన అనంతరం అక్కడి నుంచి ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా కరాంజియాకు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ స్వామీజీ గోమాతను దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కరాంజియా భక్తులు శంకరాచార్య స్వామీజీకి పాదుకపూజ నిర్వహించా రు.

ఆ తర్వాత అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆడి టోరియంలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన సభలో గోసంసద్ కార్యక్రమానికి శంకరా చార్య స్వామీజీ అంకురార్పణ చేశారు. ఆవును పశువుగా చూడకుండా గోమాత గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్‌లో గోధ్వజ్ స్థాపన చేస్తారు.