11 June, 2026 | 1:23 AM

కొలనుపాకలో అపురూప కుడ్య చిత్రాలు

11-06-2026 12:50 AM
  1. సోమేశ్వరుడి ఆలయంలో గుర్తింపు
  2. కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఘనత
  3. చిత్రాలు 16/17వ శతాబ్దానికి చెందినవిగా నిర్ధారణ

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ చరిత్రలో మరో అరుదైన ఆవిష్కరణ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామోజు హరగోపాల్, సిరిపురం నరేందర్, ముల్లక్కల రవికుమార్, మేఘ, కుండె, గణేశ్‌లతో కూడిన కొత్త తెలంగాణ చరిత్ర బృం దం అద్భుతమైన చారిత్రక కుడ్య చిత్రాలను (మురల్స్) గుర్తించింది.

ఆలయ మంటప ప్రవేశద్వా రంలో ఎడమ వైపు డంగుసున్నం పూసిన పైకప్పులో శతాబ్దాల నాటి భారీ కుడ్య చిత్రాలను వారు గుర్తించారు. వీటిలో దేవతామూర్తులు, పౌ రాణిక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నా యి. గతంలో పిల్లలమర్రి, కోటగుళ్లు, రాచకొండలోని రామాలయం పైకప్పులకు ఇటువంటి వర్ణ చిత్రాలను చూశాం. భువనగిరి బ్రాహ్మణవాడ శివాలయంలోనూ వర్ణచిత్రాలు ఉండేవని చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు రాసిన పుస్తకం లో ఉంది.  

ప్రాచీన కళా వైభవానికి నిదర్శనం

సోమేశ్వరాలయం అంతర్భాగంలోని పైకప్పు లో చిత్రీకరించబడిన ఈ వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సిరిపురం నరేందర్ తొలుత గుర్తించారు. అనంతరం చరిత్ర బృందం సభ్యులు వాటిని పరిశీలించి విశ్లేషించా రు. ఈ చిత్రాలు కథాకథనాత్మకాలు అని, ఏదో ఒక యక్షగానంలోని కథాంశాన్ని చిత్రించారని, ఊరేగింపు దృశ్యంలో విశ్వబ్రహ్మ చిత్రంపైన ఆ పేరు (విశ్వబ్రహ్మ) తెలుగులో రాసి ఉన్నట్ల గుర్తించారు.

లిపి కాలాన్నిబట్టి 16,17వ శతాబ్దాల నాటి తెలుగు రాతగా నిర్ధారించవచ్చని, ఈ చిత్రాలు అప్పటివేనని చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఈ చిత్రాల్లో  అక్కడక్కడ నా మ వాచకాలు, శరభ, సంగరోలు వంటి పేర్లున్నాయని, ఇవి ప్రాచీన కళా వైభవానికి నిదర్శనమ న్నారు. వీటికి కెమికల్ ట్రీట్‌మెంట్ చేస్తే మరిన్ని చారిత్రక పేర్లు, చిత్రాలు వెలుగుచూస్తాయని ఆ యన అభిప్రాయపడ్డారు.