42 ఏళ్ల తర్వాత.. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
కాగజ్ నగర్,(విజయక్రాంతి): వారందరూ ఒకే చదువుల అమ్మ ఒడి లో చదువుకున్నారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో 42 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై ఆదివారం బాలభారతి పాఠశాల లో కలుసుకున్నారు. ముఖ కవళికలను చూసి పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఆప్యాయతతో ఏరా....అంటూ కౌగిలించుకోవడంతో సభా వేదిక మొత్తం చప్పట్లతో మార్మోగింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని బాల భారతి ఉన్నత పాఠశాల లో 1984-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన వివిధ ప్రాంతాలకు చెందిన పూర్వ విద్యార్థులు అందరూ ఎస్పీఎం హెచ్ఆర్డి హాల్ లో ఒకే చోట చేరి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పలువురు గురువులు సలీం, చారి, స్వర్ణ లక్ష్మి, గోవిందరావు, శంకర్రావు తదితరులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోనున్నారు. పాఠశాలలో చదివిన రోజులను నెమరేసుకుంటూ ఆనాటి స్మృతులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తమ హోదాలను మరచి మిత్రులతో సరదాగా గడుపుతూ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సంతోషం వ్యక్తపరిచారు. పూర్వ విద్యార్థులు కంభంపాటి వేణు గోపాల్, విడిదినేని శ్రీనివాసరావు, పార్లపల్లి నారాయణ, పర్రె సురేష్, డి .వెంకటేశ్వర, లక్ష్మణ్, మాధవి లత, గీత తదితరులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతానికి తమ వంతు కృషి చేశారు.




