12-02-2026 05:01:25 PM
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాంబు బెదిరింపు ఇమెయిల్ ఒక బూటకమని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. బుధవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయ టెర్మినల్స్‌లో పేలుడు సంభవించనున్నట్లు ఆర్జీఐ విమానాశ్రయ కస్టమర్ సపోర్ట్ విభాగానికి తెలియని ఇమెయిల్ వచ్చింది.
ఆ ఇమెయిల్ లో బహ్రెయిన్ నుంచి వచ్చే గల్ఫ్ ఎయిర్ 274 విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎయిర్ పోర్టులో బాంబు పేలుతున్నట్లు ఆర్జీఐఏకి సందేశం వచ్చింది. ఈమెయిల్ వచ్చే సమయానికే విమానం ల్యాండ్ అయిందని, ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అప్రమతమై క్షుణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, బాంబు బెదిరింపు నకిలీదని పోలీసులు గురువారం తేల్చి చెప్పారు. ఈ బూటకపు బాంబు ఇమెయిల్ పై కేసు నమోదు చేసి ఈ సమాచారాన్ని అందించిన నింధితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.