29 August, 2026 | 2:09 PM

అమెజాన్ పేరిట ఫేక్ కాల్

28-11-2024 12:40 AM

ఉద్యోగం పేరిట మోసం

కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని స్నేహపూరి కాలనీకి చెందిన నజీరుద్దీన్‌కు బుధవారం అమెజాన్ నుంచి అంటూ రాకేష్‌కుమార్, కమలేష్ పేర ఓ కాల్ వచ్చింది. అమెజాన్‌లో ఉద్యోగం కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని చెప్పగా రూ.3,850 ఫోన్ పే ద్వారా నజీరుద్దీన్ చెల్లించాడు.

తాము కామారెడ్డికి వస్తున్నామని, మరో రూ.2,750 పంపించాలని చెప్పడంతో నజీరుద్దీన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్‌కాల్స్‌కు ప్రజలు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.