7 May, 2026 | 1:52 PM

గంజాయి మత్తులో యువకుడి వీరంగం

28-11-2024 12:43 AM

మంచిర్యాల, నవంబర్ 27 (విజయక్రాంతి): గంజాయి మత్తులో ఓ యువ కుడు వీరంగం సృష్టించిన సంఘటన మంచిర్యాల పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని టీటీడీ భవనం వద్ద రెడ్డి కాలనీకి చెందిన ఓ యువకుడు గంజాయి సేవించాడు. అటుగా వెళ్తున్న ఇంటర్ చదువుతున్న మరో యువకుడిపై ఒక్కసారిగా దాడి చేశాడు.

ఇది చూసిన స్థానికులు ఆపేప్రయత్నం చేయగా మత్తులో ఉన్న యువకుడు.. వాడ్ని చంపాలంటూ ! ఓ బైక్‌ను ఎత్తి పక్కకు పడేసి, తన తలపై తానే కొట్టుకుంటూ విచిత్రంగా ప్రవర్తించాడు. అదే సమయంలో అక్కడకు బ్లూకోల్ట్ సిబ్బంది చేరుకోగా.. యువకుడి స్నేహితులు సర్ది చెప్పి ఇంటికి పంపించారు.