30 March, 2026 | 1:48 PM

Breaking News

వెన్నెల నగర్ లో నీటి, కరెంటు సమస్య పరిష్కరించాలి   •   లావాదేవీల్లో జాప్యం వైన్స్ షాపుల మూసివేతతో కలకలం   •   నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం   •   మలిదశ ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్   •   మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •  

కుటుంబం సమాధి

05-08-2024 01:56 AM

వయనాడ్‌లో ఒకే కుటుంబంలో 15 మంది మృతి

వయనాడ్ (కేరళ), ఆగస్టు 4: కేరళలోని వయనాడ్‌లో కొండచరియ లు విరిగిపడి ప్రమాదంలో బాధితుల గుండెకోతకు అంతే లేకుండా పోతున్నది. చూరమల గ్రామంలో మన్సూర్ అనే వ్యక్తి తన కుటుంబంలో ఏకంగా 16 మందిని కోలో యిన ఒంటరిగా మిగిలాడు. కాగా, మటిదిబ్బలకింద ఇంకా ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న అనుమానం తో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు ౪౦౦కు చేరింది. కాగా, సహాయ చర్యల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ శనివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆయన వయనాడ్‌లో పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు, సామగ్రి అందజేశారు. అదంతా ఓ వీడియో రూపంలో చిత్రీకరించిన ‘మెమరబుల్ డే(మరువరాని రోజు)’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 3౫౦మందికి పైగా చనిపోతే నీకు మెమరబుల్ డేగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తులు చిరస్మరణీయం ఎలా అవుతాయో చెప్పాలని నిలదీశారు.