calender_icon.png 17 February, 2026 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన వద్దు

17-02-2026 12:00:00 AM

మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో ఉన్న ఫొటో ఇటీవల సోష ల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళనపడ్డారు. ఆయనకు ఏమైనా గాయమైయిందా? రాబోయే ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ఈ రూమర్స్‌పై చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు.

ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని, చిన్నపాటి షోల్డర్ కీహో ల్ సర్జరీ జరిగిందని ఆయన స్పష్టంచేశారు. ముందస్తు జా గ్రత్తగా చేసిన సాధారణ ప్రక్రియ అని, ప్రస్తుతం తాను సాఫీగా కోలుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది సం క్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ప్రే క్షకులను పలుకరించిన చిరంజీవి ప్రస్తు తం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బాబీతో మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.