సాగు గోషా... సర్కార్ తమాషా
- రైతుల పంట పొలాలను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు*
- పంటలు ఎండిపోతున్న పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వం
- లిఫ్ట్ మోటార్లను రిపేర్ చేయించకపోవడంతో దాదాపు 80 ఎకరాలు వరి పంట ఎండిపోయింది
- ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టుకున్న రైతు
బోధన్ అక్టోబర్ 04 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా(Nizamabad District) నవీపేట్ మండలం నిజాంపూర్ గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకం(Lift Irrigation Scheme) ఉంది.ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 1600 ఎకరాల పంట భూమికి(Agricultural land) నీరు అందించడం జరుగుతుంది. ఏదైతే గత రెండు నెలల కింద ఈ లిఫ్టును ప్రారంభించి రైతులకు(Farmers) నీరు అందించడం జరిగింది దాదాపు 20 రోజుల కింద ఈ లిఫ్ట్ యొక్క రెండు మోటార్లు, పూర్తిగా చెడిపోవడం జరిగింది.
ఏదైతే 20 రోజుల కింద మొరాయించినా ఈ మోటార్లను ఇప్పటివరకు రిపేర్ చేయించే నాథుడే కరువయ్యాడు,ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు దాదాపు ఈ లిఫ్ట్ కింద నీరు అందక పోవడంతో సుమారు 80 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది.రైతు ఎకరానికి 30 వేయి ఖర్చు పెట్టి ఈ స్థాయి వరకు వరి పంటను తీసుకొస్తే గోదావరి నదిలో నీరు ఉండి కూడా మోటార్లను బాగు చేయించలేక తమ వరి పంటను ఎండగొట్టారని చెప్పేసి లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గణేష్ నిన్నటి రోజున బాధతో కన్నీరు మున్నీరవుతు తన వరి పంటకు నిప్పు పెట్టుకోవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకొని మా తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత వెంటనే స్పందించి జిల్లా నాయకులను తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్లి రైతుకు మనోధైర్యాన్ని నివ్వాలని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉండాలన్నారు,
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ... చేతికి వచ్చిన పంట కు నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట ప్రభుత్వం ఉంది,బోధన్ ఏమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి పక్క గ్రామం లోనే ఇలా పంటలు ఎండిపోవడం సిగ్గు చేటు,రైతులకు న్యాయం చేయలేని మీరు పదవిలో ఉండి లేనట్లే అని ,నష్ట పోయిన పోయిన పంటల పైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మోటార్ల ని రిపేర్ చేయించి రైతులను ఆదుకోవాలని ,నష్ట పోయిన పంటకు వెంటనే నష్ట పరిహారం కూడా అందించాలని లేని యెడల నష్ట పోయిన రైతులతో ఇంటిని ఏమ్మెల్యే గారి ఇంటిని,జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు ఏలేటి నవీన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ ,సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు,టౌన్ ప్రెసిడెంట్ యెండల ప్రసాద్ జిల్లా నాయకులు కరిపే గంగాధర్,షాన్వాజ్ జనార్దన్,దినేష్ ,సంతోష్,రాఘవేందర్,జాదవ్,కృష్ణ ,ఆశిష్,నరహరి,భూమయ్య,మహిళా నాయకులు సరిత,రేఖ ,శోభ ,ప్రమీల రైతులు కల్లెం బాబన్న,గణేష్,సాయిలు,రాజు,ఒడ్డున ,ధర్మన్న తదితరులు ఉన్నారు.ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిందే
బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
నిజాంపూర్ ఎత్తిపోతల పరిధిలో పంటల పరిశీలించారు
మండలంలోని నిజాంపూర్ లిఫ్టు పరిధిలోని నిజాంపూర్ గ్రామ శివారులో పొట్ట దశలో ఉండి ఎండి పోయిన పంటలకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్గావు, సీని యర్ నాయకులు న్యాలకంటి అబ్బన్న, తెడ్డు పోశెట్టి, బాబర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వారు నిజాంపూర్ లిఫ్టు పరిధిలో లింగాపూర్, నిజాంపూర్ గ్రామాల్లో స్థానిక రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో ఎండిపోయిన పంటలను పరిశీ లించారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి నిజాంపూర్ ఎత్తిపోతలకు సంబంధించి మరో రెండు మోటర్లకు మరమ్మతులు చేయించి, ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. లిప్టు నీరు అందక ఇప్పటి వరకు లింగాపూర్, నిజాంపూర్ గ్రామాలకు చెందిన వంద ఎకరాలకు పైగా చేతికివచ్చిన పంటలు ఎండిపో యినట్లు తెలిపారు. ఎండిన పంట లకు ఎకరాకు రూ. రూ.50 వేల నిజాంపూర్ గ్రామ శివారులో ఎండిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిప క్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిం చారు.
కేసీఆర్ పాలనలో సస్యశ్యామలం
పదేండ్ల కేసీఆర్ పాలనలో 24 గంటల పాటు విద్యుత్ సర ఫరా ఉండేదని దీంతో ఎక్కడ కూడా గుంట భూమి కూడా ఎండలేదని వారు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శ నడ్డి నిజాంపూర్ లిప్టు మరమ్మతులకు రూ.41 లక్షలు మంజూరు చేశారని, కానీ ఈ ప్రాంత రైతుల నిర్లక్ష్యంతో మరమ్మతులు చేసుకోలేదంటూ అధికార పార్టీ కి చెందిన నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగు లుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బెల్లాల్ నర్సింగ్ రావు, ఆర్మూర్ శ్రీనివాస్, డాంగే శ్రీకాం త్(బబ్లు), డాంగే సతీశ్, గైని సతీశ్, బొర్ర సురేశ్, మల్లెపూ లలక్ష్మణ్ గౌడ్, పుప్పాల భోజన్న, నిజాంపూర్, లింగాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.