16 April, 2026 | 7:53 AM

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

07-04-2025 12:13 AM

చేవెళ్ల , ఏప్రిల్ 6 : ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపల్ పరిధి  చిన్న శంకర్పల్లి గ్రామానికి చెందిన బద్దం హన్మంత్రెడ్డి (48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య అనిత, ఇద్దరు కుమారులు అరవింద్ రెడ్డి , ప్రణీత్ రెడ్డి లు ఉన్నారు.

గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇటీవల భార్య, కొడుకులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఈనెల 4వ తేదీ శుక్రవారం భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు బద్దం హన్మంత్రెడ్డి చిన్న శంకరపల్లిలోని తన వ్యవసాయ భూమిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహానికి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.