07-04-2025 12:11:58 AM
మహబూబ్‌నగర్ ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా నోడల్ జిల్లాగా జిల్లాల విభజన అయిన తర్వాత కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పోటీపడి మరి టెండర్లను దక్కించుకొని నిర్మించడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి కోర్టు మీదుగా కలెక్టర్ బంగ్లా చౌరస్తా వరకు చేరుకునే రోడ్డు గుంతల మాయంగా మారింది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఈ రోడ్డు మరమ్మతులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో రోడ్డు వేయకపోవడంతో గుంతలు గుంతలుగా రోడ్డు దుస్థితి చేరుకుంది. తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టర్ బంగ్లా చౌరస్తా వరకు రూ 3 కోట్ల 20 లక్షలు మంజూరైనప్పటికీ ఈ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకొని రోడ్డు నిర్మించడం లో వెనకంజ వేస్తుండు.
రూ. 3 కోట్ల 20 లక్షలు మంజూరైన రోడ్డు వేయట్లే
తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టర్ బంగ్లా చౌరస్తా వరకు బీటి రోడ్డు మంజూరు అయినప్పటికీ అమ్మ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ సదానంద స్వామి రోడ్డు వేయడంలో వెనకంజ వేస్తున్నారు. దాదాపు ఏడాది క్రితమే ఈ రోడ్డు వేసేందుకు టెండర్ దక్కించుకున్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ఉన్నత అధికారులు సైతం ఉన్న ప్రాంతంలోనే సదరు కాంట్రాక్టర్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అమ్మ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ను ఉన్నతాధికారులు బ్లాక్ లిస్టులో లో పెట్టే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే నూతన కాంట్రాక్టర్ తో బీటీ రోడ్డు వేసే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.
ఈ రోడ్డు మీదుగా రోజు జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ
మహబూబ్‌నగర్ పట్టణంలో ఈ రోడ్డు కు చాలా ప్రాముఖ్యత ఉంది. జిల్లా జడ్జి తో పాటు ఇతర విభాగాల మరో 11 మంది జడ్జిలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్లు, సిఐలు, ఎస్త్స్రలు, కక్షిదారులు, 424 మంది న్యాయవాదులు, న్యాయవాదులను కలిసేందుకు, ఆ మార్గం మీదగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు వేలాదిగా ఈ రోడ్డు మార్గం ను ఉపయోగిస్తారు.
కాగా సదరు కాంట్రాక్టర్ మాత్రం ఈ రోడ్డు టెండర్లు దక్కించుకొని రోడ్డు వేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండడంతో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు ఇకనైనా స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ ఆ రోడ్డు నిర్మాణం చేపడతారా ? లేదా? అనే కోణంలో పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి రోడ్డు త్వరగా పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాంట్రాక్టర్ రోడ్డు గురించి పట్టించుకోవట్లే
కోర్టు రోడ్డు మీదుగా ఈ రోడ్డు లో నిత్యం ఉన్నత అధికారులు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. టెండర్ పూర్తి అయిన విషయం నిజమే. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ కు పలుమార్లు బీటీ రోడ్డు వేయాలని అధికారులు సూచించినట్లు తెలుస్తుంది. మున్సిపల్ పాలకవర్గం ఉన్న సమయంలో కూడా సంబంధిత పాలక వర్గం ఈ రోడ్డు విషయం పలుమార్లు మా దృష్టికి వచ్చింది.
అప్పటి నుంచి కూడా సదరు కాంట్రాక్టర్ కు చెప్పిన నిర్లక్ష్యంగానే వివరిస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ముందు చూపుతో పారదర్శకంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. కావాలని నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదని కూడా ఎమ్మెల్యే పలమార్లు ప్రకటించారు. ఇకనైనా పనులు త్వరగా చేసి సౌకర్యాలను ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్డు గుంతలు కావడంతో నిత్యం ఇబ్బందులు
తెలంగాణ చౌరస్తా మీదు గా కోర్టుకు వెళ్లేటువంటి దారి నిత్యం రద్దీగా ఉంటుంది ప్రతిరోజు వెయ్యి మంది దాకా కక్షిదారులు జిల్లా కొట్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వివిధ కోట్లకు హాజరవుతూ ఉంటారు. వీరితోపాటు న్యాయవాదులు, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి న్యాయవాదులు న్యాయమూ ర్తులు వీరందరూ కూడా ఈ దారి వెంటే ప్రయాణిస్తుంటారు అటువంటి దారి గుంతల మయంగా మారింది చాలా కాలంగా ఈ జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రయాణించాల్సి వస్తుంది.
అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఈ దారి వెంట వెళ్తుంటారు వాహనదారులకైతే ఇబ్బందులు ప్రతిరోజు తప్పడం లేదు కనుక ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను అదేవిధంగా ప్రజలు కక్షిదారులు న్యాయమూర్తులు న్యాయవాదులు ఇబ్బంది పడకుండా చూడాలి
- తంగిళ్ళ కృష్ణ, న్యాయవాది,
మహబూబ్‌నగర్