calender_icon.png 15 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగులో కొట్టుకోపోయి రైతు మృతి

15-08-2025 09:14:36 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): వాగులో కొట్టుకోపోయి ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. లింగాల మండల కేంద్రానికి చెందిన మూడవత్ పెంట్య నాయక్(65) పొలానికి వెళ్లి వస్తా అని చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఎంత వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. పొలానికి వెళ్లే దారిలో ఉన్న కాలువలో కొద్ది దూరంలో పైకి తేలి ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు ఆయనను బయటికి తీసి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడు పెంట్య నాయక్ కు భార్య లక్ష్మి ఇద్దరు కుమారులు ఉన్నారు.