అక్కడ శిథిలం.. ఇక్కడ అసౌకర్యం!
మండల కేంద్రంలో కూలే దశలో ఉన్న పశు వైద్యశాల భవనం
తిమ్మాపురంలో కొరవడిన వసతులు
పశువైద్యానికి ఇబ్బందులు పడుతున్న రైతులు
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూలై 14: మండలంలోని పశువైద్యశాలల పరిస్థితి దా రుణంగా మారింది.ఒకచోట భవనం పూర్తిగా శిథిలం కాగా, మరోచోట ఉన్న భవనంలో కనీస వసతులు లేక పశువైద్య సిబ్బంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. పశు వైద్యులు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా ఆయా గ్రామాల పశువుల ఆసుపత్రుల భవనాల పరిస్థితి దయనీయంగా మారింది. జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి,తిమ్మాపురం గ్రామాలలో రెండు పశు వైద్యశాలలు ఉన్నాయి.
అర్వపల్లిలోని పశువైద్యశాల భవనం 50 ఏళ్ల కిందట నిర్మించిందికావడంతో పూర్తిగా శిథిలమై,ఏ క్షణం లోనైనా కూలే దశకు చేరింది.చిన్నపాటి వ ర్షం పడినా ఈ ఆసుపత్రి భవనం వరద నీ టితో నిండిపోతుంది. వైద్యులు, సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా తిమ్మాపురం గ్రామంలోని పశు వైద్యశాల భవనం గత నాలుగేళ్ల క్రితం నిర్మించారు.కానీ ఈ భవనం లో కనీస వసతులు కొరబడ్డాయి.నీటి వసతి లేదు,చుట్టూ ప్రహారీ లేదు. ఈ ఆసుపత్రిలో కనీస వస్తువులు కల్పించడంతోపాటు మం డల కేంద్రం అర్వపల్లిలోని శిథిలమైన పశువైద్యశాల భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని రైతును కోరుతున్నారు.
కొత్త భవనాన్ని నిర్మించి, సౌకర్యాలు కల్పించాలి
అర్వపల్లిలోని పశువైద్యశాల భవ నం పూర్తిగా శిథిలమైంది,కొత్త భవ నం నిర్మించడం కో సం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు, ప్రజాప్రతినిధుల కు అనేకసార్లు వినతి పత్రాలు అందిం చాం.ఇప్పటికైనా అర్వపల్లిలో కొత్త భవ నం నిర్మించాలి. అలాగే తిమ్మాపురం గ్రామంలో ఉన్న పశువైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
ఎల్లెంల అవిలయ్య, సీపీఎం నాయకులు






