కదంతొక్కిన కర్షకులు

12-09-2026 | 04:40am

వ్యవసాయానికి కరెంట్ సరిపడ ఇవ్వడం లేదని ఆగ్రహం

అప్రకటిత కోతలు పెడుతున్నారంటూ మండిపాటు

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన బాట

సబ్‌స్టేషన్ల ఎదుట, రహదారులపై ధర్నాలు.. రాస్తారోకోలు 

మక్కజొన్న, పత్తి మొక్కలతో రోడ్డుపై నిరసన

24 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ 

మహబూబాబాద్/చిగురుమామిడి/కోరుట్ల రూరల్/కామారెడ్డి, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): వ్యవసాయ కరెంట్ సరఫరా(Power Supply)లో కోతలు పెడుతున్నారంటూ రైతులు ఆందోళన(Farmers Protest) బాట పట్టారు. తెలంగాణలో పలు చోట్ల నిరసనలకు దిగారు. పంటలు చేతికందే సమయంలో కోతలు సరికావంటూ మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని ఏరి యాల్లో సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేపట్టారు.

కొన్ని ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి, నిరసనలు నిర్వహించారు. పంటలు చేతి కందే సమయంలో అరకొరగా విద్యుత్ సరఫరా చేస్తే ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వ స్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కోతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్కారు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయానికి కచ్చితంగా 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాల్సిందేని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి, విద్యు త్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం ఎల్లంపేట విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశా రు. ఒకపక్క ఎల్‌నినో కారణంగా వర్షాలే లేవని బాధపడుతుంటే.. మరోపక్క విద్యుత్ స రఫరాలో తరచూ ఆటంకాల వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయా రు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.

విద్యుత్ సరఫరాలో కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి రైతులు ఆందోళనకు దిగారు. మక్కజొన్న, పత్తి మొక్కలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకు కనీసం 8 గంటలు కూడా కరెంట్ ఉండడం లేద ని మండిపడ్డారు. అధికారులను అడిగినా కరెక్టు సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. ఎస్సై జగదీశ్వర్, ట్రాన్స్‌కో ఏడీ నరేందర్ నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

సాగుకు నిరంతర విద్యుత్ అందించాలని, యూ రియా యాప్ విధానాన్ని రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మ ండలం పైడిమడుగు గ్రామంలో రైతులు ఆం దోళన చేపట్టారు.విద్యుత్ సబ్‌స్టే షన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంత రం ప్రధాన రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంట్ అర కొర సరఫరాపై కామారెడ్డి జిల్లా లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్క నూర్ మండ లం కంచర్ల, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో, అలాగే పాల్వంచ మండలం ఇస్సాయిపేట రైతులు ఆందోళన చేపట్టారు. పెద్ద మల్లారెడ్డి, ఇస్సాయిపేటల్లో రైతులు సబ్ స్టేషన్లను ముట్టడించారు.

కరెంట్ కోతలు పెట్టడం సరి కాదని మండిపడ్డారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు అందిస్తు న్న కరెంట్ సరఫరాలో మళ్లీ కోతలు విధించ డమేమిట ని ప్రశ్నించారు. ఆ సమయంలో కూడా ఒ క్కోసారి మధ్యలో ట్రిప్ అయితే, ఇక కరెంట్ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు బోర్లు ఉన్నా.. అరకొర కరెం ట్ వల్ల ఎకరం పంటకు నీరందే పరిస్థితి లేదని వా పోయారు. వ్యవసాయానికి ఎప్పటిలాగే ఉచితంగా 24 గంటలు కరెంట్ సరఫరా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరి ంచారు. వేల్పుగొండ ఏఈ, డీఈలు చేరుకొ ని రైతులను సముదాయించారు. రెండు రోజుల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు