17 May, 2026 | 3:49 PM

వట్టిమల్లలో లారీల కొరతపై రైతుల ఆందోళన

17-05-2026 02:42 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో పాటు, మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సకాలంలో తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.