17 May, 2026 | 3:34 PM

మే 20న ఇల్లందులో మెడికల్ షాపులు బంద్

17-05-2026 02:40 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మెడికల్ షాపుల బంద్కు ఇల్లందు కెమిస్ట్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఆ విషయాన్ని ఆదివారం ఇల్లెందు లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని, GSR 817 (28-08-2018)ను ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.

అలాగే చిన్న మెడికల్ షాపుల మనుగడకు భంగం కలిగించే కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల ను అరికట్టాలని కోరారు. సమ్మె కారణంగా రోగులకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, అత్యవసర మందులు, బీపీ, షుగర్, గుండె సంబంధిత మందులను రెండు రోజుల ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.