30 June, 2026 | 9:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతులకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి

10-03-2026 02:00 AM

గజ్వేల్, మార్చి 9: లో వోల్టేజీ సమస్యతో గజ్వేల్ ప్రాంత రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, రైతులకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని బిఆర్‌ఎస్ నా యకులు విద్యుత్ శాఖ డిమాండ్ చేశారు.

బిఆర్‌ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మా బాయి నర్సింగరావు, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు దేవి రవీందర్ ఇతర బిఆర్‌ఎస్ నాయకులు సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఏఈఈ, కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు నాణ్యమైన విద్యుత్ ను 18 గంటలపాటు సరఫరా చేయాలని డీఈఈ భాను ప్రకాష్, ఏడి ఈ జగదీష్ ఆర్య, ఏఈఈ మారుతీ రావులకు వినతిపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రైతులకు 14 గంటలు నిరంతర విద్యుత్ను అందిస్తున్నామని అబద్ధాలు చెబుతుందని, 11 గంటల లో వోల్టేజీ విద్యుత్ను రైతులకు అందిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నో వోల్టేజ్ సమస్యతో రైతుల బోర్లు మోటార్లు కాలిపోతున్నాయని, ఇప్పుడిప్పుడే వేసుకున్న పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మే లు చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు మురళి, బాబు రాజు, మమత పో చయ్య, కనకసేన, ఆయా గ్రామాల సర్పంచ్లు,మాజీ సర్పంచ్లు రైతులు, మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.