calender_icon.png 25 May, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పెద్ద జనుము, జీలుగ విత్తనాలను సరఫరా చేయాలి

25-05-2025 05:27:46 PM

రాజంపేట విండో అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్..

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో రైతులకు జీలుగ, పెద్ద జనుము, విత్తనాలను విండోల ద్వారా సరఫరా చేయాలని రాజంపేట విండో అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్(Rajampet Window President Nallavelli Ashok) ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వర్షాలు పడుతున్నందున రైతులకు తమ చేనులలో దిగుబడి పెంచేందుకు ముందుగా పెద్ద జనుము జీలుగ విత్తనాలు నాటుతారని ప్రభుత్వం వెంటనే  సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు.