13 March, 2026 | 9:21 PM

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

13-03-2026 08:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించి మౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ పరీక్షకు మొత్తం 97 58 మంది విద్యార్థులు హాజరుకానునట్టు వివరించారు. ఇందులో 47 86 బాలికలు 49 64 బాలురు పరీక్ష రాయండి తెలిపారు. జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అక్రమాలకు పాల్పర్తి చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.