25-05-2025 05:23:38 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల(Saraswati Pushkaralu)లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించి అభిషేకాలు పూజలు చేస్తారు. అనంతరం మాట్లాడుతూ... కాలేశ్వరం పుష్కరాలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ఈ ట్రాఫిక్ సమస్య కొరకు పార్కింగ్ స్థలం కొరత ఉన్నదని, దీనికి తోడు గత రెండు రోజుల నుండి వర్షం కురుస్తుండడంతో చేళ్లలో పార్కింగ్ చేయడం వాహనాలు దిగబడుతున్నాయని, దీని కొరకు ఆర్ అండ్ బి శాఖ ద్వారా కంకర చిప్స్ వేయడం జరుగుతుందని, అయినా ట్రాఫిక్ సమస్య తీరడం లేదని, అక్కడక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నందున, వాహనదారులు సమన్వయం పాటిస్తూ తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలు నిలుపుతూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.