15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతులు నూతన వ్యవసాయ విధానంపై దృష్టి సారించాలి

11-06-2025 12:00 AM

శాస్త్రవేత్తలు పద్మావతి, నరేష్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్10: ప్రస్తుత సీజన్లో రైతులు నూతన వ్యవసాయ విధానంపై దృష్టి సారించి అధిక దిగుబడులను పొందాలని భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త పద్మావతి,కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త దొంగరి నరేష్ లు అన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని రామన్నగూడెం రైతువేదికలో అధిక దిగుబడుల కోసం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు.పంటఉత్పత్తి,నేల ఆరోగ్యం,వనరుల నిర్వహణను మెరుగుపరచడం,రసాయన ఎరువులపై ఖర్చు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలన్నారు.

రైతులు బయట విడిగా దొరికే సీడ్లను కొనొద్దని అన్ని ప్రభుత్వ మరియు రిజిస్టర్ కంపెనీల సీడ్ లనే కొనాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఇస్కో జిల్లా మేనేజర్ వెంకటేష్,ఏఓ గణేష్,ఏఈఓలు నేరెళ్ల సత్యం,శోభారాణి,రైతులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,చెంచల శ్రీనివాస్,రుక్మయ్య,అవిలయ్య,కర్ణాకర్,కేవీకే శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.