4 May, 2026 | 9:08 PM

రైతులు నాణ్యమైన విత్తనాలను వాడాలి

04-05-2026 07:58 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): అధిక దిగుబడుల కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి  సూచించారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మఠంపల్లి మండలం కేంద్రంలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్,స్థానిక తాహశీల్దార్ లావురి మంగా, ఎంపిడివో జగదీష్ కుమార్ తో కలిసి వారు మాట్లాడుతూ... నేల ఆరోగ్య పరిరక్షణ,మట్టి నమూనా సేకరణ,భూసార,హెల్త్ కార్డు, సమతుల ఎరువుల వినియోగం, నానో యూరియా, డిఏపి  ఉపయోగాలు,సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల వినియోగం, వానాకాలానికి వరిలో ఎంపిక చేయబడిన రకాలు అనే అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించారు.