16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఫర్టిలైజర్ యాప్ సేవలు రైతులు వినియోగించుకోవాలి

20-02-2026 12:32 AM
  1. జిల్లాలో ఎరువులకు కొరత లేదు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి):రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు.యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు.

షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఉదయం స్టాక్ వివరాలు పరిశీ లించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూ సారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు.

జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు.  వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు.జిల్లాలో ఈ నెల 1 వ తేదీ నుంచి వరకు 92 వేల 735 సంచుల యూ రియా వచ్చిందని,

యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. 79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.పరిశీలనలో ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.