16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మసిపూసి మారేడుకాయ చేయడం నాతో కాదు

20-02-2026 12:34 AM
  1. ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తాం

శివాజీ అలోచనలు యువతకు మార్గదర్శకం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్బన్ మండలం ఆరపల్లి గ్రామంలో నూ తన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఆయన, అనంతరం ఆరపల్లి, పట్టణ పరిధిలోని అయ్యోరుపల్లి, రూరల్ మండ లం జయవరం గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శివాజీ జయంతి వేడు కలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపా రు. అణచివేతకు, నియంతృ త్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన మహానేత శివాజీ మ హారాజు ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. యువత శివాజీ చరిత్రను తెలుసుకొని దేశాభివృద్ధిలో భాగస్వా ములు కావాలని పి లుపునిచ్చారు.

శివాజీ అందరివారు, ఏ ఒక్కరికే చెందిన వారు కా రు అని స్పష్టం చేశా రు. ఆరపల్లి గ్రామంలో ప్రారంభించిన నూ తన గ్రామ పంచాయతీ భవనం ప్రజలకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలకు అందుబా టులో ఉండి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని తెలిపారు. ఆరపల్లి గ్రామంలోని పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంకెపల్లి గెజిట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించామని, వాటికి శాశ్వత పరిష్కారం తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. 

మహి ళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.