పత్తిలో సమగ్ర సస్యరక్షణపై శిక్షణ
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Knowledge Center)ఆధ్వర్యంలో పత్తిలో సమగ్ర సస్యరక్షణ (ఐపీఎం)పై రైతులకు శిక్షణ, క్షేత్ర సందర్శన నిర్వహించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా. టి.భరత్ పత్తిలో పురుగుల నియంత్రణకు స్టిక్కీ, ఫెరోమోన్ ట్రాప్స్, ట్రాప్, బౌండరీ పంటల వినియోగంపై అవగాహన కల్పించారు.
ఆత్మ డైరెక్టర్ బోడ దివ్య కేవీకే సేవలు, సాంకేతిక సలహాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 19:19:19 పోషక ఎరువు, స్టిక్కీ ట్రాప్స్ పంపిణీ చేశారు. క్షేత్ర సందర్శనలో పత్తిలో టొబాకో స్ట్రీక్ వైరస్ (టీఎస్‌వీ) లక్షణాలను గుర్తించి, వ్యాధి వ్యాప్తికి వాహకంగా పనిచేసే త్రిప్స్ నియంత్రణపై సూచనలు ఇచ్చారు. సర్పంచ్ తాటి వాణి,ఏఈఓ , రేవాప్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.