29 June, 2026 | 2:03 AM

ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతల చూపు

29-06-2026 12:00 AM

మహబూబాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈ వానాకాలం సీజన్ లో ప్ర త్యామ్నాయ పంటల సాగు వైపు అన్నదాత లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మెట్ట సా గులో ఆయిల్ పామ్ పంట సాగు చేపడుతుండగా, తాజాగా కూరగాయల పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వాణిజ్య పంటల సాగు విషయంలో రైతులు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంత సాను కూలంగా ఉండడంతో పాటు హార్టికల్చర్ శా ఖ ఇచ్చే రాయితీలు కూడా వాణిజ్య పంట లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతోంది. 

పంట మార్పిడి పై ప్రత్యేక కార్యాచరణ

 ‘పంట మార్పిడి’ చేసి ప్రతీ గ్రామంలో 50 ఎకరాల్లో కూరగాయలు, ఆయిల్ పా మ్, పండ్లు, పూలు, మునగ, మల్బరీ, తేనె టీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం చే పట్టడానికి కృషి చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ఈ వానకాలంలో పంట మార్పిడి విధానానికి ప్రాధాన్యం ఇచ్చేలా కృషి జరుగుతోంది.

మారుతున్న వాతావరణ పరిస్థితులు

స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతీ గ్రామంలో 50 ఎకరాలలో పంట మార్పిడి  చేపట్టాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ పామ్, మల్బరీ, టమాటా, వంగ, పచ్చి మిరప, దోస, బీర, సొర, గోరు చిక్కుడు, బెండ, ఆకు కూరలు, మునగ మరియు షేడ్ నెట్స్ క్రింద టమాట, కీర, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్,  వెదురు మొదలైనవి సాగు చేయాలని, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం  రైతులు పొందాలని కోరుతున్నారు.

ఆధునిక పద్ధతులతో అధిక మేలు

కూరగాయల సాగులో నూతన, ఆధునిక పద్దతులు పాటించుట, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం, షేడ్ నెట్ లలో, ట్రెల్లిస్, ఎగబాకించే పద్ధతి, పందిరి సాగు మొదలైన నూతన ఆధునిక పద్ధతులు. రైతులు నిత్యం ఆదాయం ఇచ్చే కూరగాయల పంటల సాగుకు అనుకూలంగా చెబుతున్నారు. ఈ సంవత్సరం వాన కాలంలో వాణిజ్య పంటల సాగుతో పాటు, కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంపకం  మహబూబాబాద్ జిల్లాలో విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికార వార్తలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం బయ్యారం మండలంలో ఏవో రాజు ప్రత్యేకంగా పంటలు సాగులో రైతులకు ఎన్నో రకాల మేలు కరమైన అంశాలను వివరిస్తూ, ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి పెంపొందిస్తున్నారు.

కూరగాయల పంట సాగులో రాయితీలు 

కూరగాయల పంట సాగులో హార్టికల్చర్ శాఖ అనేక రాయితీలను కల్పిస్తోంది. ఎకరానికి రూ.2,100, అంతర పంటల సాగుకు, కూరగాయల శాశ్వత పందిరి నిర్మాణానికి ఎకరానికి లక్ష రూపాయల రాయితీ, ఎకరానికి రూ.10 వేలు కూరగాయల నారు మొక్కల సరఫరా, కూరగాయల చిరు సంచుల పంపిణీ వంటి పలు రాయితీ సౌకర్యాలు కల్పిస్తోంది.

రోజు వారీగా తినే కూరగాయలను ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి  కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలి. 

 మరియన్న,  జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, మహబూబాబాద్