1 May, 2026 | 2:05 AM

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

01-05-2026 12:16 AM

మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్:బొమ్మలపల్లి నర్సింలు యాదవ్

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు సొసైటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని  స్పష్టం చేశారు.రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం పూడూరు సొసైటీ వారు ధాన్యం బస్తాలను ఇవ్వకున్న మేడ్చల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బస్తాలు పంపిణీ చేస్తామని నరసింహులు యాదవ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరేణి పోచయ్య.పూడూరు సొసైటీ డైరెక్టర్ లు మనోహర్ రెడ్డి.శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు.