25 June, 2026 | 1:19 AM

బాన్సువాడలో ఆహార భద్రత అధికారి ఆకస్మిక తనిఖీ

25-06-2026 12:03 AM

నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరిక

బాన్సువాడ, జూన్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పలు హోటళ్లు, రిటైల్ దుకాణాల్లో బుధవారం ఆహార భద్రత అధికారి జి. విక్రమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో అపరిశుభ్రంగా నిల్వ చేయడం, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడటం గుర్తించి నిర్వాహకులను ఆహార భద్రత అధికారి తీవ్రంగా హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత లోపించింది.

అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం రాష్ట్ర ఆహార ప్రయోగశాల, హైదరాబాద్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా FSS చట్టం-2006 ప్రకారం చర్యలు తీసుకుంటారనీ ఆయన తెలిపారు. హోటళ్లు, దుకాణాల యజమానులు పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది శుభ్రత పాటించాలని, రిటైల్ వ్యాపారులు FSSAI లేబులింగ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.