25 April, 2026 | 3:58 PM

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

25-04-2026 02:45 PM

మధిర,(విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ..... ప్రతిపక్ష నాయకుడు కమల్ రాజు తన రాజకీయ ఉనికిని మీడియా హడావిడితో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, సమస్యలపై స్థిరమైన పని చేయడం కన్నా ప్రెస్ మీట్ల ద్వారానే గుర్తింపు పొందాలని చూడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో రైతులు చెల్లింపుల కోసం నెలల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. 

అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట నష్టం సమయంలో పెద్ద హామీలు ఇచ్చినప్పటికీ, అవి అమలులోకి రాలేదని, రైతులకు ప్రత్యక్షంగా న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  రైతులకు వారం రోజుల్లోపే ధాన్యం కొనుగోలు డబ్బులు, బోనస్‌లు, మొక్కజొన్న చెల్లింపులు అందుతున్నాయని తెలిపారు. ఇది రైతు సంక్షేమానికి ప్రభుత్వ కట్టుబాటును స్పష్టంగా చూపుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా విమర్శలు చేయకుండా, రైతులకు జరుగుతున్న మేలును గుర్తించి నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.