ఐఐటీ మద్రాస్‌తో విద్యామండలి ఎంవోయూ
10-03-2026 01:40 AM
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో స్వయం ప్లస్ అనే ఇన్షియేటివ్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు గానూ ఐఐటీ మద్రాస్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందాన్ని సోమవారం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో డిజిటల్ విద్య, ఆన్‌లైన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్, మెంటర్‌షిప్, పాఠ్యప్రణాళిక అభివృద్ధిను మరింత బలోపేతం చేయనున్నట్లు విద్యామండలి తెలిపింది.




