సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం సాగు చేయాలి
ముఖ్యఅతిథులుగా ఏడిఏ తాతారావు, జానంపేట సర్పంచ్ ఉమామహేశ్వరి
పినపాక, మార్చి 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్పాక మండలం జానంపేట పంచాయతీ పరిధిలోగల రైతు వేదిక నందు మంగళవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడిఏ తాతారావు, జానంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ పూనం ఉమామహేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేయాలని తెలిపారు.
ఇలా వ్యవసాయం చేస్తే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రజలు తింటున్నటువంటి పంటలకు పై ఎక్కువ మోతాదులో యూరియా, రసాయనిక ఎరువులు, కాంప్లెక్స్ వాడటం వలన మానవ శరీరంలో రక్తనాళాల్లో కలిసితమై మనుషులు అనారోగ్యానికి గురి అవుతున్నారని, భూమిలో సారం తగ్గి ముందు తరాలకు పంట పండటానికి ఉపయోగంగా ఉండవని, పంటలపై మోతాదుకు మించి మందులు పిచికారి చేయొద్దని,
రసాయనకే ఎరువుల వాడకం తగ్గించి, కేంద్రీయ ఎరువులను వాడాలని తెలిపారు. సేంద్రీయ ఎరువులు వాడటం ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని మేము ఎంత చెప్పినా డిస్ప్లే చూపెట్టిన, అది రైతులతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేశ్వరరావు, ఏఈఓ నాగేశ్వరరావు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.




