10 June, 2026 | 5:53 PM

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం

30-01-2025 12:43 AM

తొమ్మిది మంది భారతీయులు మృతి

జెడ్డా, జనవరి 29: సౌదీ అరేబి యా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయు లు మృతిచెందారు. మృతుల కుటుం బ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో మాట్లాడుతున్నామని, వారికి పూర్తి సహకారం అందిస్తున్న ట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో తెలిపింది.

సౌదీలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనలో గాయపడినవారు త్వర గా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది.

మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 8002440003 (టోల్ ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301(వాట్సాప్) ఏర్పాటు చేశామని తెలిపింది.  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందిస్తూ ప్రమాదంలో భారత పౌరుల మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసింద న్నారు. బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు.