నీటిని పొదుపుగా వాడుకోవాలి: గంభీరావుపేట సర్పంచ్
బోరు మోటర్ ప్రారంభం.
గంభీరావుపేట, ఆగస్టు 01 (విజయక్రాంతి): నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ -నర్సాగౌడ్ ప్రజలకు సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలోని 8వ వార్డు కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 3 లక్షల వ్యయంతో బోరు మోటర్‌ను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు.
పల్లె దవాఖాన, ఎంఆర్సీ భవనం, బాలికల వసతిగృహం, కాలనీ పరిసరాల్లో నీటి కొరత ఉండటంతో స్థానిక వార్డు సభ్యుడు రెడ్డి మల్ల రాజనర్సు సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు ఎగదండీ స్వామి, దేవసాని కృష్ణ, అర్జున్ ప్రశాంత్, దేవరాజ్, మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






