30 May, 2026 | 2:12 AM

పదవీ విరమణ పొందనున్న జీఎం (సీఎంసీ)కి సన్మానం

30-05-2026 12:59 AM

కొత్తగూడెం, మే 29,( విజయక్రాంతి): ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న జీఎం (సీఎంసీ)  బత్తుల శ్రీనివాసరావు  కు శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్  ఎం  షాలెమ్ రాజు కార్యలయం లో సన్మానించారు..ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ షాలెమ్ రాజు  మాట్లాడుతూ,  బత్తుల శ్రీనివాసరావు , సింగరేణి సంస్థలో 33 సంవత్సరాలుగా  వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ, సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు.

తన విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో సహచరులకు ఆదర్శంగా నిలిచారని , సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. అనంతరం  బత్తుల శ్రీనివాసరావు  మాట్లాడుతూ, పీవీకే5 ఇంక్లైన్లో పనిచేసిన రోజులను స్మరించుకున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవలందించడం తనకు గౌరవప్రదమైన అనుభవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జీఎం కోటిరెడ్డి , ఏజీఎం (ఫైనాన్స్)  బీబత్స , వీకేసీఎం (సిఎంఓఏఐ) ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా /ప్రాజెక్టు ఆఫీసర్  నరసింహరావు , ఏజీఎం (సివిల్)  రామకృష్ణ , పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి , ఎస్‌ఈ (ఈ&ఎం)  అజ్మీర శ్రీనివాస్ , ఎస్‌ఈ  నాగభూషణం , (సిఎంఓఏఐ) జనరల్ సెక్రటరీ ఉపేందర్  , ఏరియా సెక్యూరిటి  అధికారి అభిలాష్ , సీనియర్ పీవో  ఎం.మురళీ , ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.