బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
23-07-2026 12:20 PM
బాధిత కుటుంబానికి కంఠరెడ్డి. తిరుపతి రెడ్డి రూ.5 వేల ఆర్థిక సాయం.
రామాయంపేట జూలై 23 (విజయ క్రాంతి): రామాయంపేట మండలం సుతార్‌పల్లి గ్రామానికి చెందిన వడ్ల. పెంటయ్య అకాల మరణం పట్ల మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి.తిరుపతి రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, స్థానిక నాయకుల ద్వారా తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కల స్వామి, యేసు, సిద్ధరాములు, ఏర్పుల స్వామి, ఆర్సీ నర్సింలు, డి. స్వామి, డి. సత్తయ్య, రవి, లక్ష్మీపతి, పోచయ్య, స్వామి, యాదగిరి, నరసింహులు, వెంకటేష్, రాములు, రవి, నాగరాజు, రాగి అంజయ్యతో పాటు గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






