23 July, 2026 | 1:51 PM

నీట్‌ పేపర్‌ లీక్‌పై రాజకీయాలు వద్దు.. చర్చకు మేం సిద్ధం

23-07-2026 12:45 PM

నీట్‌ పేపర్‌ లీక్‌పై  మీరు రాజకీయం చేయవద్దు..

ముందే షరతులు పెడితే ఎలా?కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నీట్ పై చర్చకు(NEET paper leak debate) సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై రాజకీయాలు వద్దని, చర్చకు మేం సిద్ధం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju) పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ పై చర్చ విషయమై కాంగ్రెస్ సహా విపక్షాలతో మాట్లాడినట్లు కిరణ్ రిజిజు తెలిపారు. విపక్ష సభ్యులు షరతులు విధించడం మొదలుపెట్టారని చెప్పారు. ముందే షరతులు పెడితే ఎలా? అని ప్రశ్నించారు.

యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని స్పష్టంగా చెప్పారని తెలిపారు. పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని వెల్లడించారు. కేంద్ర ఏజెన్సీ పేపర్ లీక్ సహా అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయనే దానిపై చర్చిద్దామన్నారు. నీట్ రీ ఎగ్జామ్(NEET Re-exam) నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్రం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కేంద్ర చర్యలపై దేశ ప్రజల ముందుంచుతామని చెప్పామన్నారు. ప్రతిపక్షాలు మళ్లీ చర్చలు చేపట్టకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ మిగతా అంశాలు పక్కనపెట్టి నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధమని తెలిపారు.