30 May, 2026 | 2:06 AM

డ్రైనేజీల శుభ్రతకు ప్రత్యేక చర్యలు

30-05-2026 12:57 AM

మున్సిపాలిటీ చైర్ పర్సన్ సామేని సుజాత రామనాథం 

మధిర, మే 29(విజయ క్రాంతి): మధిర మున్సిపాలిటీలోని అన్ని వార్డులో వర్షాకాలం దృష్ట్యా మెయిన్ డ్రైనేజీల శుభ్రతకు ప్రత్యేక పూడిక తొలగింపు పనులు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మెయిన్ డ్రైనేజీల పూడిక తొలగింపు పనులు వేగవంతంగా చేపట్టారు. ఇందుకోసం రాజమండ్రి నుండి ప్రత్యేక కార్మికులను అందుబాటులో ఉన్నారని అన్నారు.

అనంతరం చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం మాట్లాడుతూ.. వర్షపు నీరు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన పూడికను త్వరితగతిన తొలగించి శుభ్రపరచాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కౌన్సిలర్ గద్దల మాధురి, 12వ వార్డ్ కౌన్సిలర్ మోదుగు నాగలక్ష్మి, గద్దల నాని, మోదుగు బాబు, రాజా పాల్గొన్నారు.